మోదీకి రావణుడిలా ‘వంద తలలు’ ఉన్నాయా?

గుజరాత్‌ ఎన్నికల్లో తన ముఖం చూసి ఓట్లు వేయాలని ప్రతి ఎన్నికల్లో కోరుతున్న ప్రధాని నరేంద్రమోదీకి రావణుడిలా ఏమైనా ‘వంద తలలు’ ఉన్నాయా అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వేసిన ప్రశ్న రాజకీయ రాద్ధాంతానికి దారితీసింది.

Published : 30 Nov 2022 04:07 IST

తన ముఖం చూసి ఓట్లు వేయాలని అడుగుతారేం?
రాజకీయ రాద్ధాంతానికి దారితీసిన ఖర్గే వ్యాఖ్యలు

దిల్లీ: గుజరాత్‌ ఎన్నికల్లో తన ముఖం చూసి ఓట్లు వేయాలని ప్రతి ఎన్నికల్లో కోరుతున్న ప్రధాని నరేంద్రమోదీకి రావణుడిలా ఏమైనా ‘వంద తలలు’ ఉన్నాయా అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వేసిన ప్రశ్న రాజకీయ రాద్ధాంతానికి దారితీసింది. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో ఎన్నికల సభలో ఖర్గే మాట్లాడారు. మోదీ ప్రధానిగా పనిచేసే బదులు గుజరాత్‌లో స్థానికసంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ సమరం వరకు అన్నింటి ప్రచారాలకూ వస్తుంటారని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నియామక పత్రాలనూ ఆయనే అందజేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘అబద్ధాల్లో మోదీ బాద్‌షా. రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది? 30 లక్షల ఖాళీల్ని ఎందుకు భర్తీ చేయట్లేదు? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు రావడం వారికి ఇష్టం లేదా’ అని ప్రశ్నించారు.

గుజరాతీలంటే ఖర్గేకు ద్వేషం: భూపేంద్ర పటేల్‌

ప్రజా మద్దతు లేకపోవడంవల్లనే కాంగ్రెస్‌ పార్టీ గుజరాత్‌ను, ప్రజలను నిందిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ వ్యాఖ్యానించారు. గుజరాతీలపై ఖర్గేకు ఉన్న ద్వేషాన్ని ఆయన వ్యాఖ్యలు చాటుతున్నాయని ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు