వైకాపాను నమ్ముకుంటే కష్టాలే..ఎమ్మెల్సీ ఎదుట విలపించిన ఆ పార్టీ నాయకురాలు

వైకాపా అధికారంలోకి రావాలని ఎంతో కష్టపడితే.. ఇప్పుడు తనపైనే కేసు పెట్టి వేధిస్తున్నారని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పరిధిలోని కొట్నూరుకు చెందిన ఆ పార్టీ వార్డు కన్వీనర్‌ సునీత విలపించారు.

Updated : 30 Nov 2022 10:39 IST

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: వైకాపా అధికారంలోకి రావాలని ఎంతో కష్టపడితే.. ఇప్పుడు తనపైనే కేసు పెట్టి వేధిస్తున్నారని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పరిధిలోని కొట్నూరుకు చెందిన ఆ పార్టీ వార్డు కన్వీనర్‌ సునీత విలపించారు. హిందూపురం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ మంగళవారం ఎంపీడీవో కార్యాలయం వద్దకు రాగా.. సునీత తన గోడు వినిపించారు.

కొట్నూరు జాతీయ రహదారి సమీపంలో తనకు 42 సెంట్ల స్థలం ఉందని, అందులో 21 సెంట్ల భూమి ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఓ ప్రముఖుడి కుమారుడు ఆక్రమించుకున్నారని ఆమె ఆరోపించారు. మిగిలిన భూమిలో పెట్టిఅంగడితో జీవనం సాగిస్తుంటే దాన్నీ ఇటీవల పొక్లెయిన్‌తో తొలగించి, తనపైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని విలపించారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారమయ్యేలా చూస్తానని ఎమ్మెల్సీ ఆమెను ఓదార్చారు. అంతకు ముందు సునీత విలేకరులతో మాట్లాడుతూ.. వైకాపాను నమ్ముకుంటే కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని