రైతుల పక్షానే సుప్రీం తీర్పు

రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల పక్షానే న్యాయం, ధర్మం నిలిచాయని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పేర్కొన్నారు.

Published : 30 Nov 2022 04:57 IST

తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల పక్షానే న్యాయం, ధర్మం నిలిచాయని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పేర్కొన్నారు. అమరావతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వక్ర భాష్యాలు చెప్పడం జగన్‌, వైకాపా నేతలకే సాధ్యమైందన్నారు. కోర్టు తీర్పు తెదేపాకు మొట్టికాయ అంటూ సజ్జల, వికేంద్రీకరణకు మద్దతు అని మంత్రి అంబటి రాంబాబు, మూడు రాజధానులపై ముందుకెళ్తామని మంత్రి బొత్స మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజధానిని మార్చే అధికారం, హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదన్న విషయాన్ని వైకాపా నేతలు గుర్తించాలి’ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని