జగన్‌ ప్రభుత్వానికి సిగ్గుచేటు

సొంత బాబాయ్‌ని హత్య చేసిన వారిని కాపాడాలని అధికారబలంతో సీఎం జగన్‌ చేసిన విఫలయత్నాలన్నీ సుప్రీంకోర్టు తీర్పుతో బట్టబయలయ్యాయని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

Published : 30 Nov 2022 04:57 IST

బొండా ఉమామహేశ్వరరావు

ఈనాడు, అమరావతి: సొంత బాబాయ్‌ని హత్య చేసిన వారిని కాపాడాలని అధికారబలంతో సీఎం జగన్‌ చేసిన విఫలయత్నాలన్నీ సుప్రీంకోర్టు తీర్పుతో బట్టబయలయ్యాయని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయడం.. జగన్‌ ప్రభుత్వానికే సిగ్గుచేటన్నారు. అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు ఆయన ప్రభుత్వానికి గొడ్డలిపెట్టులాంటివని చెప్పారు. మంగళవారం బొండా విలేకరులతో మాట్లాడుతూ.. ‘తన తండ్రి హత్య కేసు విచారణలో నిందితులు అరెస్టు కాకుండా జగన్‌రెడ్డి ప్యాలస్‌ నుంచి మద్దతు లభిస్తున్నందునే విచారణలో జాప్యం జరుగుతోందని వివేకా కుమార్తె గతంలో కోర్టును ఆశ్రయించారు. అందుకే ఆమెను, ఆమె భర్తను కూడా భయపెట్టి దారికి తెచ్చుకోవాలని జగన్‌రెడ్డి అండ్‌ కో ప్రయత్నించారు. ఈ కేసులో ఆధారాలు, సాక్ష్యాలను రూపుమాపిన అవినాశ్‌రెడ్డి, అతని బ్యాచ్‌ను సీఎం జగన్‌ కాపాడుతున్నారు...’ అని ఆరోపించారు. కర్నూలులో హైకోర్టు పెట్టడం లేదని.. అమరావతిపై వాదనల సమయంలో ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారని, దానిపై ముఖ్యమంత్రి జగన్‌ సమాధానమివ్వాలని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని