ప్రభుత్వ ఆస్తుల రక్షణకు విశాఖ తరహా పోరాటం
‘విలువైన ప్రభుత్వ, ప్రజల ఆస్తులను, భవనాలను తప్పుడు పద్ధతుల్లో ప్రభుత్వ పెద్దలు హక్కుభుక్తం చేసుకోవాలనుకుంటే జనసేన తరఫున కచ్చితంగా నిలువరిస్తాం.
నాదెండ్ల మనోహర్
ఈనాడు, అమరావతి: ‘విలువైన ప్రభుత్వ, ప్రజల ఆస్తులను, భవనాలను తప్పుడు పద్ధతుల్లో ప్రభుత్వ పెద్దలు హక్కుభుక్తం చేసుకోవాలనుకుంటే జనసేన తరఫున కచ్చితంగా నిలువరిస్తాం. విశాఖ తరహాలోనే న్యాయ పోరాటం, ప్రజా పోరాటం చేసి ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల చేతికి చిక్కకుండా రక్షిస్తాం’ అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, ప్రభుత్వ ఆస్తులకే రక్షణ లేకపోతే ఇక ప్రజల ఆస్తులను ఎవరు కాపాడతారని ఆయన ప్రశ్నించారు.
వ్యవస్థలతో పవన్ కల్యాణ్ యుద్ధం: నాగబాబు
ఈనాడు, అమరావతి: యువతపై కేసులు పెట్టి హింసిస్తున్న నాయకులను గద్దె దించేందుకు పవన్ కల్యాణ్ వ్యవస్థలతో యుద్ధం చేస్తున్నారని జనసేన నాయకుడు నాగబాబు తెలిపారు. హైదరాబాద్‌లో కుప్పం, నంద్యాల నియోజకవర్గాల జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమై మాట్లాడారు. యువత ప్రజాప్రతినిధులుగా మారినప్పుడే వ్యవస్థలు చక్కబడతాయని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా