బాబాయ్‌ కేసు పక్క రాష్ట్రానికి... అబ్బాయ్‌ చంచల్‌గూడ జైలుకి: లోకేశ్‌

వివేకానందరెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేయడంపై తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా మంగళవారం స్పందించారు.

Published : 30 Nov 2022 05:33 IST

ఈనాడు, అమరావతి: వివేకానందరెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేయడంపై తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా మంగళవారం స్పందించారు. ‘బాబాయ్‌ కేసు పక్క రాష్ట్రానికి.. అబ్బాయ్‌ చంచల్‌గూడ జైలుకి’ అని ఆయన పేర్కొన్నారు.

సర్పంచుల నిరసనను భగ్నం చేయడం నియంతృత్వం

‘తమ పంచాయతీ నిధులు మింగేసిన సర్కారు తీరుపై శాంతియుతంగా సర్పంచులు తిరుపతిలో నిరసన తెలిపే కార్యక్రమాన్ని పోలీసు బలగాలతో భగ్నం చేయడం జగన్‌రెడ్డి ప్రభుత్వ నియంతృత్వ తీరుకు నిదర్శనం’ అని లోకేశ్‌ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘తిరుపతితో పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌, ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి, ఇతర నేతల అరెస్టులను ఖండిస్తున్నా. రాష్ట్రప్రభుత్వం మళ్లించిన రూ.8,660 కోట్లను తిరిగి పంచాయతీ ఖాతాలకు జమ చేసి.. సర్పంచుల ఆధ్వర్యంలోకి తీసుకురావాలి’ అని లోకేశ్‌ డిమాండు చేశారు.

మనోజ్‌ అకాల మృతికి సంతాపం

గుంటూరు జిల్లా తెదేపా నాయకుడు దండమూడి మనోజ్‌ అకాలమృతిపై తెదేపా అధినేత చంద్రబాబు,  ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పార్టీ పటిష్ఠతకు ఆయన ఎంతో కృషిచేశారని కొనియాడారు. మనోజ్‌ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మనోజ్‌ మరణం పార్టీకి తీరని లోటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని