ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి: జనసేన అందోళన

విశాఖ సీబీసీఎన్‌సీ (ద కన్వెన్షన్‌ ఆఫ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తన్‌ సర్కార్స్‌ )లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు కోన తాతారావు డిమాండ్‌ చేశారు.

Published : 30 Nov 2022 05:33 IST

విశాఖపట్నం (కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: విశాఖ సీబీసీఎన్‌సీ (ద కన్వెన్షన్‌ ఆఫ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తన్‌ సర్కార్స్‌ )లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు కోన తాతారావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం సీబీసీఎన్‌సీ భూముల వద్ద జనసేన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం లోపల ఉన్న సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 3,600 గజాల స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారు. లోపలకు వెళ్లడానికి మార్గం లేకపోవడంతో బయట నుంచి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్‌ మాట్లాడుతూ.. సీబీసీఎన్‌సీలో ప్రభుత్వ భూములున్నాయని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, కనీసం సర్వే చేయకుండా జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు టీడీఆర్‌ మంజూరు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.

* జనసేన ఆధ్వర్యంలో ఆందోళన జరిగిన గంట తరువాత రెవెన్యూ, సాంఘిక సంక్షేమశాఖ అధికారులు సీబీసీఎన్‌సీ స్థలం వద్దకు చేరుకుని సర్వేనంబర్‌ 75/4లో ఉన్న 3,600 గజాల స్థలం సాంఘిక సంక్షేమశాఖకు చెందినదని బోర్డు ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా విశాఖ జిల్లా సాంఘిక సంక్షేమశాఖ జేడీ రమణమూర్తి మాట్లాడుతూ 2009లో జీఓ 99 ప్రకారం తమకు స్థలాన్ని కేటాయించారని తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని