తెలంగాణపై మోదీ కుట్రలు మానాలి: కూనంనేని

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా, ప్రగతిని ముందుకు సాగనీయకుండా కేంద్రంలోని నరేంద్రమోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 01 Dec 2022 03:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా, ప్రగతిని ముందుకు సాగనీయకుండా కేంద్రంలోని నరేంద్రమోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పరిపాలనను అస్థిరపరచడంతో పాటు ప్రభుత్వాన్ని కూలదోసే విధంగా స్వతంత్ర, రాజ్యాంగ వ్యవస్థలైన ఐటీ, ఎన్నికల కమిషన్‌, గవర్నర్‌ వ్యవస్థలను తీవ్రంగా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. విభజన హామీలే అమలు చేయని భాజపా తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటోందని విమర్శించారు.

2008 డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి: చాడ

2008 డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు లభించలేదని, నియామక జాబితాలో పేర్లు వచ్చినా కూడా ఆకస్మికంగా ఆ ప్రక్రియను నిలిపివేయడంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానం కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చి ఉన్నందున.. రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని