ఆడపిల్లలకు భద్రత కరవు: తెదేపా
తెలంగాణలో ఆడపిల్లలకు భద్రత కరవైందని, హోంమంత్రి డమ్మీలా మారారని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న ఆరోపించారు.
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఆడపిల్లలకు భద్రత కరవైందని, హోంమంత్రి డమ్మీలా మారారని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న ఆరోపించారు. బుధవారం ఎన్టీఆర్భవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ హయత్‌నగర్‌లో ఓ విద్యార్థినిని తోటి విద్యార్థులు నరకయాతనకు గురిచేశారని.. స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్లిన మహిళలు, చిన్నారులు ఇంటికి భద్రంగా తిరిగి వస్తారనే నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఆడబిడ్డలు పడుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. 2014-21 మధ్య కాలంలో పోక్సో కేసులు మూడు రెట్లు పెరిగాయన్నారు.
* పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సిరవేణి స్వప్న ఆధ్వర్యంలో కొందరు బుధవారం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సమక్షంలో తెదేపాలో చేరినట్లు పార్టీ మీడియా కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: వలస కూలీగా సర్పంచి
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Sports News
Suryakumar Yadav: హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్
-
Movies News
Vani jayaram: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం