జగన్‌ రాజకీయాల నుంచి తప్పుకోవాలి

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేయడమే కాదు... రాజకీయాల నుంచే తప్పుకోవాలని, ఆయన రాజకీయాలకు అనర్హుడని మాజీ మంత్రి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.

Published : 01 Dec 2022 04:33 IST

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేయడమే కాదు... రాజకీయాల నుంచే తప్పుకోవాలని, ఆయన రాజకీయాలకు అనర్హుడని మాజీ మంత్రి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డితోపాటు జగన్‌మోహన్‌రెడ్డి, భారతీరెడ్డి, అవినాశ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇలా వై.ఎస్‌.పేరుతో ఉన్న అందరినీ విచారించాలని డిమాండు చేశారు. కేసును సీబీఐవారు నిక్కచ్చిగా, నిశితంగా దర్యాప్తు చేయాలని కోరారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నాడు వివేకా హత్యను మాపై మోపి గుండెలో పోటును గుండెపోటుగా మార్చారు. గొడ్డలి పోటు గుండెపోటుగా ఎలా మారింది? గుండెపోటు ప్రకటన తర్వాత మేం మధ్యలో దూరి గుండెలో పొడిచామా’ అని ప్రశ్నించారు. కేసు విచారణను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు కాదు... ముక్కు, ముఖం పగిలిపోయే తీర్పు అని వ్యాఖ్యానించారు. ‘తన అన్న జగన్‌ ప్రభుత్వంలో న్యాయం జరగదని సునీత కోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ మొదలయ్యాక అసలు చరిత్ర బయటకు వచ్చింది. అప్పటి వరకు అనేక కథలు వినిపించారు. కేసును నీరుగార్చేందుకు సీబీఐ దగ్గరకుపోతే ఇంత... పోకపోతే ఇంత అంటూ కుప్పలు కుప్పలుగా ధనం వ్యయం చేశారు. శంకర్‌రెడ్డి భార్య పేరుతో రిట్లు వేయించారు. చిన్నాయనను చంపించినందుకా? కరోనా సమయంలో ప్రజలు చనిపోయినా పట్టించుకోనందుకా..? సారా, ఎర్ర చందనం అమ్ముతున్నందుకా..? ప్రత్యేక హోదా తేలేకపోవడం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేనందుకా.? కోర్టులతో 175 సార్లు మొట్టికాయలు వేయించుకున్నందుకా ఎందుకు జగన్‌కు 175 సీట్లు ఇవ్వాలి’ ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని