పేదల ఇంటి కోసం రూ.5 లక్షలు ఇవ్వాలి: ఆప్‌

సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) డిమాండ్‌ చేసింది.

Published : 01 Dec 2022 04:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) డిమాండ్‌ చేసింది. బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆప్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యురాలు ఇందిరాశోభన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం చెబుతున్న రూ.3 లక్షలు ఏమూలకూ సరిపోవని, ముందుగా ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షలు చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా 2.91 లక్షల ఇళ్లను నిర్మించి పేదలకు అందించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం 2014 నుంచి రెండు పడక గదుల ఇళ్ల విషయంలో పేదలను మోసం చేస్తోందని మండిపడ్డారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అందించిన నిధులను కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులకు మళ్లించారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నిధుల గురించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలేదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని