మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామనడం కోర్టు ధిక్కరణే
మూడు రాజధానుల బిల్లును తిరిగి తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం ముమ్మాటికి కోర్టు ధిక్కరణే అవుతుందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
ఈనాడు, దిల్లీ: మూడు రాజధానుల బిల్లును తిరిగి తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం ముమ్మాటికి కోర్టు ధిక్కరణే అవుతుందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే మళ్లీ మూడు రాజధానుల బిల్లును తీసుకువస్తామనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బాబాయ్ వై.ఎస్. వివేకానందరెడ్డిని చంపింది ఎవరనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసని అయినా ఎవరూ బహిరంగంగా చెప్పలేరన్నారు. వివేకా హత్య కేసు విచారణను ఏపీ నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసిందని రఘురామ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Latestnews News
IND vs AUS: అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ ‘డూప్లికేట్’ వ్యూహం!
-
India News
Mumbai: ముంబయిలో ఉగ్ర దాడులంటూ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..!
-
Movies News
Michael Review: రివ్యూ : మైఖేల్
-
Movies News
K.Viswanath: ‘కళా తపస్వి’.. ఆ పదం వినగానే భయం వేసింది!
-
General News
Tamilisai: పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణ: గవర్నర్ తమిళిసై
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు