ఘర్షణ వాతావరణానికి చంద్రబాబు కుట్ర

పోలవరం సందర్శన పేరిట ఘర్షణ వాతావరణానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

Updated : 02 Dec 2022 09:36 IST

మూడు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలి
మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పోలవరం సందర్శన పేరిట ఘర్షణ వాతావరణానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రాత్రి 7 గంటలకు వెళ్లి అక్కడ ఆయన ఏం చూస్తారని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం చంద్రబాబు పోలవరం వద్ద బహిరంగ సభ నిర్వహించి, శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే ఎత్తుగడ వేశారు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యమైందనేది అవాస్తవం. పీపీపీ కూడా మా ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు. ఆర్‌అండ్‌ఆర్‌ నిధులు కేంద్రం నుంచి నేరుగా లబ్ధిదారులకే వెళ్లేలా సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాశారు. పోలవరం విషయంలో మేం చంద్రబాబుకు 3ప్రశ్నలు వేస్తున్నాం... విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కేంద్రమే నిర్మించాల్సిన ప్రాజెక్టును రాష్ట్రమే ఎందుకు చేపట్టింది? 2018కే ఎడమ, కుడి కాలువలకు నీళ్లిచ్చి ఎన్నికలకు వెళ్తామని శాసనసభలో అప్పటి జలవనరుల శాఖ మంత్రి సవాల్‌ చేశారు. ఆ గడువు లోపు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు? కాఫర్‌డ్యాం నిర్మించకుండా డయాఫ్రంవాల్‌ నిర్మించడం చరిత్రాత్మక తప్పిదం కాదా? వీటికి సమాధానం చెప్పాలి. పోలవరాన్ని ఎప్పటికి పూర్తి చేస్తామో చెప్పలేంగానీ.. మేమే పూర్తిచేసి, ప్రారంభోత్సవానికి చంద్రబాబును పిలుస్తాం’ అని స్పష్టంచేశారు.  

* ప్రజల సానుభూతి పొందేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విలేకర్లతో ఆమె మాట్లాడారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని