గళమెత్తండి.. మీ గొంతుక నేనవుతా

తెదేపా బలం.. బలగం.. వెనుకబడిన వర్గాలేనని.. అటువంటి బీసీలకు జగన్‌ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 02 Dec 2022 04:23 IST

బీసీల ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు

తెదేపా బలం.. బలగం.. వెనుకబడిన వర్గాలేనని.. అటువంటి బీసీలకు జగన్‌ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బీసీ సాధికార సమితి కన్వీనర్‌ కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన బీసీల ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వివిధ సామాజికవర్గాల ప్రతినిధులు మాట్లాడుతూ... జగన్‌ ప్రభుత్వంతో తామెదుర్కొంటున్న ఇబ్బందులు, తెదేపా అధికారంలోకి వచ్చాక చేపట్టాల్సిన సంక్షేమ పథకాలను వివరించారు. ఏలూరు జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాలని, తెలంగాణ మాదిరిగా కల్లు గీత కార్మికులకు నీరా పథకం తెస్తూ, మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్‌ కల్పించాలని, కొల్లేరులో ఖాళీగా ఉన్న స్థలాలను ఒక్కో కుటుంబానికి ఐదెకరాలు కేటాయించి జీవనోపాధి కల్పించాలని కోరారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ...  ‘బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేలా నేను ప్రోత్సహిస్తా. మీరంతా వైకాపా ప్రభుత్వంపై ఐక్యంగా గళమెత్తితే.. నేను మీ గొంతుక అవుతా. కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపులో 10% నుంచి 20% రిజర్వేషన్‌ కల్పించేందుకు అధ్యయనం చేయించి, న్యాయం చేస్తా’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని