అమిత్ అరోడా ఎవరో నాకు తెలీదు.. మద్యం కేసుతో సంబంధం లేదు
దేశ రాజధాని దిల్లీ మద్యం కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని, అమిత్ అరోడా అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: దేశ రాజధాని దిల్లీ మద్యం కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని, అమిత్ అరోడా అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్నట్లుగా పేర్కొంటూ అమిత్ అరోడాను అక్కడి కోర్టులో హాజరు పరిచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది. అందులో ఎంపీ మాగుంట పేరు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీటిపై ప్రకాశం జిల్లా ఒంగోలులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులురెడ్డి మాట్లాడారు. నిజానికి అమిత్ అరోడా ఎవరో కూడా తనకు తెలియదని.. అతనితో తానెప్పుడూ ఫోన్‌లో కూడా మాట్లాడలేదన్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో తమకు ఎటువంటి ప్రమేయం లేదని గతంలోనే స్పష్టం చేశానని తెలిపారు. ఈ వ్యవహారం అంతటినీ దక్షిణాదికి చెందిన వ్యాపారులపై ఉత్తరాది వారు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈడీ విచారణలో తన పేరు చెప్పినట్టు చెబుతున్న అమిత్ అరోడా ఉత్తరాది వ్యక్తో, దక్షిణాదికి చెందిన వారో మీరే తేల్చాలని విలేకరులను ఉద్దేశించి మాగుంట వ్యాఖ్యానించారు. తన పేరు ఈడీ ఛార్జిషీట్లలో ఉందనే అంశంపై తమ కన్సల్టెంట్లు పరిశీలిస్తున్నారని, త్వరలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Aaftab: శ్రద్ధాను చంపి.. చికెన్ రోల్ తిన్నాడు
-
India News
రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి
-
Politics News
జగన్ గ్రాఫ్ పడిపోతోంది.. ఏపీ వెళ్లి పాదయాత్ర చేసుకో: షర్మిలకు కడియం సూచన
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు