ఏడాదిగా మత్స్యకారుల మహాధర్నా

హెటెరో మందుల పరిశ్రమకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మత్స్యకారులు శాంతియుత మహాధర్నా చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా దీక్షా శిబిరం వద్ద గురువారం బహిరంగ సభ నిర్వహించారు.

Published : 02 Dec 2022 04:23 IST

సంఘీభావం తెలిపిన నాయకులు

నక్కపల్లి, న్యూస్‌టుడే: హెటెరో మందుల పరిశ్రమకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మత్స్యకారులు శాంతియుత మహాధర్నా చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా దీక్షా శిబిరం వద్ద గురువారం బహిరంగ సభ నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న మత్స్యకారులకు అండగా నిలుస్తామని పలు పార్టీల నాయకులు పేర్కొన్నారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఏడాదిగా ఆందోళన చేస్తున్నా అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వ్యర్థజలాలను తరలించే రెండు పైపులైన్లు దెబ్బతిన్నాయని, మూడో పైపులైను వేసేందుకు కంపెనీ దరఖాస్తు చేసిందని పేర్కొన్నారు. పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం కారణంగా తీరప్రాంత గ్రామాల్లో ప్రజలు కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఐక్య కార్యదర్శి అజశర్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించే వరకూ పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ తోట నగేష్‌, జనసేన నాయకులు బోడపాటి శివదత్‌, కోన తాతారావు, పంచకర్ల సందీప్‌ తదితరులు ప్రసంగించారు. సీపీఎం నాయకుడు ఎం.అప్పలరాజు, జడ్పీటీసీ సభ్యురాలు కాసులమ్మ, జాతీయ మత్స్యకార సంఘ నాయకుడు మోసా అప్పలరాజు, జేఏసీ ఛైర్మన్‌ అమ్మోరియ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని