ఏపీ ప్రభుత్వ తీరువల్లే వివేకా హత్య కేసు బదిలీ

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా ఎన్నికవుతున్న వారిలో చాలామంది బినామీ కంపెనీలను సృష్టిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

Updated : 02 Dec 2022 06:36 IST

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా ఎన్నికవుతున్న వారిలో చాలామంది బినామీ కంపెనీలను సృష్టిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గురువారం కార్యకర్తల సమావేశ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వేల కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయని.. వీటిని సత్వరమే పరిష్కరించాలని కోరారు. కేసులు పెండింగులో ఉండడంవల్లే పరిస్థితులు ఇష్టారాజ్యంగా తయారయ్యాయని అన్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ అయిందని భావిస్తున్నామన్నారు. అధికారం, పలుకుబడి ఉందని అక్కడి ప్రభుత్వం సాక్ష్యాలను తారుమారు చేసే దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. నిష్పాక్షికమైన విచారణకు ఆ కేసు బదిలీ చేశారని అభిప్రాయపడుతున్నామని వివరించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని