రాష్ట్రాన్ని రెడ్లకు పంచినందుకా ‘జయహో బీసీ మహాసభ’

రాష్ట్రాన్ని రెడ్లకు పంచి, బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.34 వేల కోట్లు దిగమింగి, రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు రాజ్యాధికారం దూరం చేసినందుకా ‘జయహో బీసీ మహాసభ’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.

Published : 03 Dec 2022 04:14 IST

 తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు  కొల్లు రవీంద్ర

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రాన్ని రెడ్లకు పంచి, బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.34 వేల కోట్లు దిగమింగి, రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు రాజ్యాధికారం దూరం చేసినందుకా ‘జయహో బీసీ మహాసభ’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.  జగన్‌ పాలనలో 26 మంది బీసీ నేతల్ని దారుణంగా హత్య చేశారని, 650 మందిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని, 2500 మందిని తప్పుడు కేసులతో వేధించారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘బీసీలను మంత్రులను చేశానంటున్న జగన్‌రెడ్డి... వారికి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఇచ్చారా? పదవుల కక్కుర్తితో వైకాపాలోని బీసీ నాయకులు, మంత్రులు తమ సామాజికవర్గాల హక్కులను జగన్‌రెడ్డి కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు.  రాష్ట్రాన్ని భాగాలు చేసి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు పంచిపెట్టారు. ఇదేనా బీసీలను ఉద్ధరించడమంటే? సీఎం దగ్గర నుంచి ప్రభుత్వ సలహాదారు, డీజీపీ, సీఎస్‌ వరకూ అందరూ కడప రెడ్లు కాదా? ఇదేనా బీసీలకు ఇచ్చే ప్రాధాన్యం? తెదేపా హయాంలో అమలు చేసిన ఆదరణ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌, కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇతర పథకాలను రద్దు చేయడమేనా బీసీ సంక్షేమం? తెదేపాలో కీలకంగా ఉన్న బీసీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడితో పాటు నాతో సహా అందరిపై కేసులు పెట్టి జగన్‌ పైశాచికానందం పొందుతున్నారు...’’ అని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని