రాష్ట్రంలో భాజపా, జనసేనలే ప్రత్యామ్నాయం

వైకాపా, భాజపాకి మధ్య ఉన్నది రాజ్యాంగ బద్ధమైన సంబంధమని, అంతకుమించి ఏమీ లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.

Published : 03 Dec 2022 04:14 IST

ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు

విశాఖపట్నం(పెదవాల్తేరు), న్యూస్‌టుడే: వైకాపా, భాజపాకి మధ్య ఉన్నది రాజ్యాంగ బద్ధమైన సంబంధమని, అంతకుమించి ఏమీ లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. విశాఖలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రధాన ప్రత్యామ్నాయంగా భాజపా, జనసేనలు నిలుస్తాయి. ప్రజలు మాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. పోలవరం నిర్మాణంలో జాప్యానికి వైకాపానే కారణం.ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా కుంటుపడి ఉన్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించేందుకు వైకాపా నేతలు ముందుకు రావాలి’అని జీవీఎల్‌ సవాలు విసిరారు. విశాఖలో భారీగా భూములను ఆక్రమిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘గతంలో రెండు పార్టీలూ సిట్‌లు (ప్రత్యేక దర్యాప్తు బృందాలు) వేశాయి. వాటి నివేదికలను ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. వైకాపా ప్రభుత్వం వేసిన సిట్‌ నివేదిక అక్టోబరులో సిద్ధమైనప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదో తెలపాలి. రానున్న పార్లమెంటు సమావేశాల్లో విశాఖలో భూ కుంభకోణాలపై ప్రస్తావిస్తా. విశాఖలో వచ్చే ఏప్రిల్‌ నాటికి 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. వందే భారత్‌ రైళ్లను మూడింటిని నడపబోతున్నాం. విశాఖ నుంచి తిరుపతి, హైదరాబాద్‌, బెంగళూరు మార్గాల్లో ఇవి నడుస్తాయి’ అని జీవీఎల్‌ తెలిపారు. పార్టీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని