ఒక్క రోజే 180 ఎకరాలు కొనడానికి గుమ్మనూరు తాతేమైనా మైసూర్ మహారాజా?
ఒక్క రోజే 180 ఎకరాలు కొనడానికి మంత్రి గుమ్మనూరు జయరాం తాతేమైనా మైసూర్ మహారాజా అని తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు ధ్వజమెత్తారు.
తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: ఒక్క రోజే 180 ఎకరాలు కొనడానికి మంత్రి గుమ్మనూరు జయరాం తాతేమైనా మైసూర్ మహారాజా అని తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు ధ్వజమెత్తారు. సాక్ష్యాధారాలతో సహా ఆయన అవినీతి బయటపడ్డా తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండా నీతులు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. 2019 ఎన్నికల అఫిడవిట్లో తనకు ఎనిమిది ఎకరాలు ఉన్నట్లు పేర్కొని.. 16 నెలల్లో వందల ఎకరాలు కొనుగోలు చేయడానికి అయనకు ఎక్కడి నుంచి నగదు వచ్చిందని శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. దీనిపై సీబీఐతో విచారణ చేయిస్తే జయరాంతో పాటు ఇతర మంత్రుల భూకబ్జాలు, కుంభకోణాలు బహిర్గతమవుతాయని స్పష్టం చేశారు. ‘‘ఏడాదికి సగటున మొత్తం కుటుంబ ఆదాయం రూ.మూడు లక్షలను జయరాం ఎన్నికల అఫిడవిట్లో పెట్టడం వాస్తవం కాదా? అక్రమంగా భూములు కాజేయడమే కాక ఆ భూములపై వ్యవసాయ రుణాలు తీసుకునేందుకు కర్నూలు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది నిజం కాదా? రాయలసీమలో పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే జయరాం గంజాయి లాంటి పంటలు పండించి రూ.కోట్లు గడించారా? ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇట్టినా కంపెనీ భూములు ఆక్రమించుకున్నారు. ఆస్పరి మండలంలో కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్ పత్రాల్లో నగదు లావాదేవీ అని రాసి కంపెనీ అకౌంట్‌కు నగదు జమ చేయకుండా, డీడీ గానీ, చెక్కు గానీ ఇవ్వకుండా నేరుగా వ్యక్తులకు నగదు చెల్లించామని పేర్కొనడంతోనే ఇది కుంభకోణమని తేలిపోయింది. అధికార బలంతో అక్రమాలకు పాల్పడుతున్న జయరాం కుటుంబం భూదోపిడీలపై సమగ్ర విచారణ జరిపించాలి...’’ అని బీటీ నాయుడు డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Ajinkya Rahane: ఐపీఎల్-15 సీజన్ తర్వాత లీసెస్టర్‌షైర్‌కు ఆడనున్న అజింక్య రహానె
-
Crime News
Crime News: అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. 13 మంది సజీవ దహనం
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వెడ్డింగ్ ఫీవర్’.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు
-
Politics News
YSRCP: ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిరూపిస్తా: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే టెస్టు సిరీస్ ఆడటమా..?: ఆసీస్ క్రికెట్ దిగ్గజం
-
Movies News
Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్ కాలేకపోయింది: విజయ్ కిరగందూర్