రేవంత్‌రెడ్డితో మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చౌహన్‌ భేటీ

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 03 Dec 2022 05:08 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన చౌహాన్‌.. గంట పాటు భేటీ అయ్యారు. భారత్‌ జోడో యాత్ర, ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

కాంగ్రెస్‌కు మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడి రాజీనామా

యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు మర్రి పురురవరెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన భాజపాలో చేరనున్నట్లు తెలిసింది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని