తెలంగాణపై సమైక్యవాదుల మూకుమ్మడి దాడి

దేశంలో అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుస్తోన్న తెలంగాణపై సమైక్యవాదుల మూకుమ్మడి దాడి మొదలైనట్లు ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Published : 03 Dec 2022 05:08 IST

శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: దేశంలో అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుస్తోన్న తెలంగాణపై సమైక్యవాదుల మూకుమ్మడి దాడి మొదలైనట్లు ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణను వశపరచుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడ్డుగా ఉన్నారని.. దీంతో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ కొందరు ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. గవర్నర్‌ వ్యవహార శైలి, భాజపా దత్తపుత్రిక షర్మిల, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, తెదేపా అధినేత చంద్రబాబు మాటలు, ఈడీ, సీబీఐ దాడులతో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా సమైక్యవాదులు కుట్రలో భాగమేనని అర్థమవుతోందన్నారు. 1954 నుంచి 2014 వరకు హైదరాబాద్‌లో ఎన్నో అరాచకాలు, హత్యలు, తుపాకుల మోత, భూకబ్జాలు భరిస్తూ వచ్చామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ఎనిమిదేళ్లలో ఇలాంటి ఘటనలు జరగలేదని ఆయన గుర్తు చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, మత విద్వేషాలు తలెత్తకుండా ఉండాలంటే వారి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని గుత్తా అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ కేంద్రం వివక్ష చూపుతూనే ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు