బయ్యారం గనులేంటో నాకు తెలియదు: షర్మిల

‘‘ఆడదాన్ని అని వ్రతాలు చేసుకో అంటున్నారు.. మీరు మొనగాళ్లయితే ఉద్యోగాలు ఇచ్చి చూడాలని గతంలో అన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. బయ్యారం గనులేంటో నాకు తెలియదు. కావాలంటే విచారణ చేయండి’’ అని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Published : 03 Dec 2022 05:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ఆడదాన్ని అని వ్రతాలు చేసుకో అంటున్నారు.. మీరు మొనగాళ్లయితే ఉద్యోగాలు ఇచ్చి చూడాలని గతంలో అన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. బయ్యారం గనులేంటో నాకు తెలియదు. కావాలంటే విచారణ చేయండి’’ అని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. తెలంగాణ పోలీసులు తెరాసకు మాత్రమే ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవలి పరిణామాలపై శుక్రవారం ఇక్కడ డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంట్లో నుంచి అడుగు ఎలా బయట పెడతావో చూస్తామని, బలి ఇవ్వడానికి కూడా వెనకాడమని తాలిబన్ల మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెరాస ఆరోపిస్తున్నట్లుగా గవర్నర్‌, తాను ఒకే పాత్ర ఎలా పోషిస్తామని ప్రశ్నించారు. ఇప్పటివరకు 3,500కి.మీ.ల పాదయాత్ర పూర్తయిందని.. ఈనెల 4 నుంచి మళ్లీ చేపట్టి 14న ముగిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని