బడులు మూశారు.. బారులు తెరిచారు

బంగారు తెలంగాణలో 4,500 పాఠశాలలు మూసివేశారని, అదే సమయంలో భారీ సంఖ్యలో బారులు తెరుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు.

Published : 03 Dec 2022 05:08 IST

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

జడ్చర్ల పట్టణం, న్యూస్‌టుడే: బంగారు తెలంగాణలో 4,500 పాఠశాలలు మూసివేశారని, అదే సమయంలో భారీ సంఖ్యలో బారులు తెరుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. ఈ నెల 4న మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనికి సమాధానం చెప్పాలన్నారు. జడ్చర్లలో శుక్రవారం నిర్వహించిన బీసీ విద్యార్థి, యువజనుల పోరు యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చదువు, సామాజిక న్యాయ సాధన కోసం పాలమూరు జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోరు యాత్ర చేపట్టామన్నారు. విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇవ్వకుండా అరిగోస పెడుతున్నారని, వారు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని హెచ్చరించారు. విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. జనాభాలో అరశాతం ఉన్న వారు అధికారం అనుభవిస్తున్నారన్నారు. రాజ్యాధికారం జనాభాలో 60 శాతం ఉన్న బీసీల జన్మహక్కు అని అన్నారు. ‘వచ్చేది బీసీ రాజ్యమే.. అయ్యేది బీసీ ముఖ్యమంత్రే’ అనే నినాదంతో ముందుకు పోదామని జాజుల ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని