గుజరాత్‌ తొలి దశ పోలింగ్‌లో 63.31% ఓటింగ్‌ నమోదు

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో నమోదైన సగటు ఓటింగ్‌ 63.31శాతంగా తేలింది. 19 జిల్లాల పరిధిలోని 89 నియోజకవర్గాల్లో ఓటర్లు గురువారం ఓటు హక్కు వినియోగించుకున్న విషయం తెలిసిందే.

Updated : 03 Dec 2022 06:33 IST

గత అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా 3.42 శాతం తగ్గుదల

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో నమోదైన సగటు ఓటింగ్‌ 63.31శాతంగా తేలింది. 19 జిల్లాల పరిధిలోని 89 నియోజకవర్గాల్లో ఓటర్లు గురువారం ఓటు హక్కు వినియోగించుకున్న విషయం తెలిసిందే. తమకు అందిన పూర్తి సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత ఎన్నికల సంఘం శుక్రవారం తుది గణాంకాలను అధికారికంగా వెల్లడించింది. గిరిజనుల ప్రాబల్య జిల్లా నర్మదలో అత్యధికంగా 78.24%, తాపి జిల్లాలో 76.91%, నవసారి జిల్లాలో 71.06% అత్యధిక ఓటింగ్‌ నమోదు కావడం విశేషం. బోటాద్‌ జిల్లాలో అతి తక్కువగా 57.58 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమ్రేలి జిల్లాలో 57.59 శాతం, సూరత్‌ జిల్లాలో 62.27%, రాజ్‌కోట్‌ జిల్లాలో 60.45శాతం ఓట్లు పోలయ్యాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశలో పోలింగ్‌ జరిగిన ఇదే 89 నియోజకవర్గాల్లో 66.75 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పటికంటే ఇప్పుడు 3.42 శాతం మంది తక్కువగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చినట్లు స్పష్టమవుతోంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు