ప్రజలకు యనమల చేసిందేమీ లేదు

ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమీ లేదని కేవలం చంద్రబాబు, వారి తాబేదార్లకు రాష్ట్ర సంపదను దోచిపెట్టారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు.

Published : 04 Dec 2022 04:04 IST

మంత్రి దాడిశెట్టి రాజా

తుని గ్రామీణం: ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమీ లేదని కేవలం చంద్రబాబు, వారి తాబేదార్లకు రాష్ట్ర సంపదను దోచిపెట్టారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యనమల సొంత మండల పరిధిలో బల్క్‌ డ్రగ్‌ ప్రాజెక్టు మంజూరు చేస్తే, దానికీ వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాయడమేమిటని ప్రశ్నించారు. అప్పులతో సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల రాష్ట్రం మరో శ్రీలంకగా మారుతుందని ఆరోపించిన చంద్రబాబే.. నేడు జగన్‌ కంటే ఎక్కువ సంక్షేమం అందిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. అప్పుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ముందు ఉందని వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతూ ఆర్బీఐ లెక్కల ప్రకారం దేశంలో మన రాష్ట్రం 8వ స్థానంలో ఉందని మంత్రి దాడిశెట్టి రాజా వెల్లడించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు