రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోంది

రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో రాయలసీమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న అమరరాజా కంపెనీ సొంత రాష్ట్రాన్ని వదిలి పొరుగు రాష్ట్రానికి వెళ్లడానికి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

Published : 04 Dec 2022 04:04 IST

‘అమరరాజా’ కంపెనీ సొంత రాష్ట్రాన్ని వదిలిపోవడానికి ఇదే కారణం
తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి : రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో రాయలసీమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న అమరరాజా కంపెనీ సొంత రాష్ట్రాన్ని వదిలి పొరుగు రాష్ట్రానికి వెళ్లడానికి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన సంస్థ అమరరాజా. ఏపీలో పుట్టిన బిలియన్‌ డాలర్‌ కంపెనీ తొలిసారి చిత్తూరు వదిలి రాష్ట్రం వెలుపల రూ.9,500 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ప్రతిష్ఠాత్మక సంస్థను ప్రోత్సహించాల్సింది పోయి.. గతంలో ఇచ్చిన భూములు కూడా వెనక్కి తీసుకున్నారు. పర్యావరణ అనుమతులు, తనిఖీల పేరుతో నిత్యం ఇబ్బంది పెట్టారు. ఉపాధి నిచ్చే పరిశ్రమకు విద్యుత్తు సరఫరా నిలిపివేసి శాడిజం చాటుకున్నారు. కోర్టు తప్పుబట్టినా వైఖరి మార్చుకోలేదు. వైకాపా ప్రభుత్వం రాజకీయకక్షలతో ప్రజల ప్రయోజనాలనే కాదు. రాష్ట్ర ప్రతిష్ఠనూ పణంగా పెట్టింది. రాష్ట్రానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ప్రజలు, చరిత్ర క్షమించవు...’’ అని చంద్రబాబు శనివారం ట్వీట్‌ చేశారు. లిథియం అయాన్‌ బ్యాటరీల గిగా కర్మాగారం, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో అమరరాజా సంస్థ చేసుకున్న ఒప్పందంపై ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ట్వీట్‌కు జత చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు