రాయలసీమ గర్జనకు రానివారు సీమ ద్రోహులే: మంత్రి బుగ్గన

రాయలసీమ గర్జన పేరుతో ఈ నెల 5న కర్నూలులో నిర్వహించే సభకు హాజరుకానివారు సీమ ద్రోహులుగా మిగిలిపోతారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వ్యాఖ్యానించారు.

Updated : 04 Dec 2022 10:36 IST

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: రాయలసీమ గర్జన పేరుతో ఈ నెల 5న కర్నూలులో నిర్వహించే సభకు హాజరుకానివారు సీమ ద్రోహులుగా మిగిలిపోతారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వ్యాఖ్యానించారు. ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించే సభకు వైకాపా మద్దతిస్తోందని, రాయలసీమ అభివృద్ధిపై సభలో చర్చిస్తారని అన్నారు. శనివారం సాయంత్రం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా హయాంలో అభివృద్ధి అంతా అమరావతికి పరిమితం చేసి, పచ్చటి పొలాలను చంద్రబాబు నాశనం చేశారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రాయలసీమ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను చంద్రబాబు మోసం చేశారని బుగ్గన విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని తీర్మానించారని చెప్పారు. రాష్ట్రంలో కృష్ణా జలాలు వినియోగించుకోలేని తీర్మానాలు రూపొందించారని, 1953లో మద్రాసుతో విడిపోయిన తరువాత తెలుగు మాట్లాడే ప్రజలందరూ కలిసి ఉండాలని అప్పటి ప్రభుత్వం కర్నూలులో రాజధాని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సమావేశంలో జడ్పీ ఛైర్మన్‌ పాపిరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, మాజీ ఎంపీ బుట్టా రేణుక, వైకాపా జిల్లా అధ్యక్షుడు బి.వై.రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు