తూర్పు తీరాన్ని గుప్పెట్లో పెట్టుకునేలా జగన్‌ ప్రణాళిక

రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ఉన్న తూర్పు సముద్రతీర ప్రాంతాన్ని జగన్‌ తన బినామీల ద్వారా ఆక్రమించి, గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రణాళిక అమలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో విలేకర్లతో శనివారం ఆయన మాట్లాడారు.

Published : 04 Dec 2022 04:04 IST

శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల ఆరోపణ

తుని, న్యూస్‌టుడే: రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ఉన్న తూర్పు సముద్రతీర ప్రాంతాన్ని జగన్‌ తన బినామీల ద్వారా ఆక్రమించి, గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రణాళిక అమలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో విలేకర్లతో శనివారం ఆయన మాట్లాడారు. ‘బినామీల ద్వారా భూములు సేకరించి, షేరు ఇస్తేనే పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడు, జగన్‌కు కావాల్సిన వాళ్లు అరబిందో పరిశ్రమ స్థాపనకు పనులు చేస్తున్నారు. గన్నవరం, విశాఖ, కృష్ణపట్నం వంటి పోర్టుల పరిధిలోను ఇలానే జరుగుతోంది...’ అని యనమల పేర్కొన్నారు. అసమర్థ పాలనతో రూ.1.73 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ధ్వజమెత్తారు. బల్క్‌ డ్రగ్‌ వంటి కాలుష్య భరిత పరిశ్రమలతో తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. గాలి, నీరు, భూమి, భూగర్భజలాలు హానికరంగా మారిపోతే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అందుకే తాము జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని