దివ్యాంగులకు సేవ చేసేవారికి ఏటా అవార్డులిస్తాం: తెదేపా

దివ్యాంగులకు సేవలందించే సంస్థలు, వ్యక్తులకు ఏటా అవార్డులను అందజేసి సత్కరిస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రకటించారు.

Updated : 04 Dec 2022 05:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: దివ్యాంగులకు సేవలందించే సంస్థలు, వ్యక్తులకు ఏటా అవార్డులను అందజేసి సత్కరిస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రకటించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమాన్ని శనివారం ఎన్టీఆర్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారి దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని గుర్తుచేశారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉంటే వారిలో 4 లక్షల మందికే ప్రభుత్వం పింఛన్లు ఇస్తోందన్నారు. దళితబంధు మాదిరిగా దివ్యాంగబంధును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

*  తెలుగు యువత విభాగం రాష్ట్రస్థాయి సమావేశంలో కాసాని మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని తెరాస ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తెలుగు యువత పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడుతుందన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు