షర్మిల పాదయాత్ర వాయిదా

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర వాయిదా పడింది.

Updated : 04 Dec 2022 06:12 IST

అనుమతి కోరగా ఎందుకు నిరాకరించొద్దంటూ వరంగల్‌ సీపీ నోటీసు జారీ

వరంగల్‌ క్రైం, నర్సంపేట, చెన్నారావుపేట, న్యూస్‌టుడే: వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర వాయిదా పడింది. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఆదివారం పాదయాత్ర పునఃప్రారంభం కావాల్సి ఉండగా నేతలు అనుమతి కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేశారు. అయితే ఆ దరఖాస్తును ఎందుకు తిరస్కరించకూడదో తెలియజేయాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ శనివారం రాత్రి పార్టీ నాయకులకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. మొదటిసారి పాదయాత్రకు అనుమతి ఇచ్చిన సమయంలో తాము సూచించిన నియమాలను అతిక్రమించి వ్యక్తిగత దూషణకు పాల్పడటం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగిందంటూ ఆధారాలను దానికి జతచేశారు. ఈ క్రమంలో ఆదివారం ప్రారంభించనున్న పాదయాత్రను వాయిదా వేసుకున్నామని వైతెపా హనుమకొండ, వరంగల్‌ జిల్లాల అధ్యక్షుడు నాడెం శాంతికుమార్‌ తెలిపారు. షర్మిలతో చర్చించి నోటీసులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు