పార్లమెంటుపై కాంగ్రెస్‌ వ్యూహం ఖరారు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, ఆర్థికరంగ తీరుతెన్నులు, చైనాతో సరిహద్దు పరిస్థితులపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సమగ్ర చర్చకు పట్టుపట్టాలని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశం నిర్ణయించింది.

Published : 04 Dec 2022 05:12 IST

ప్లీనరీపై నేడు స్టీరింగ్‌ కమిటీ భేటీ

దిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, ఆర్థికరంగ తీరుతెన్నులు, చైనాతో సరిహద్దు పరిస్థితులపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సమగ్ర చర్చకు పట్టుపట్టాలని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశం నిర్ణయించింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని కేంద్రం బలహీనపరుస్తోందనీ, దీనినీ ప్రముఖంగా లేవనెత్తనున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్వీట్‌ చేశారు. చైనా నుంచి చొరబాట్లే లేవని ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్నా దానిపై పార్లమెంటులో చర్చను చేపట్టడం లేదని ఆరోపించారు. వివిధ పార్టీలు డిమాండ్‌ చేస్తున్న రీతిలో కులాలవారీగా జనాభా లెక్కల్ని వెల్లడించాలని పట్టుపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే రాజ్యసభలో విపక్షనేతగా కొనసాగించాలని నేతలంతా ఒక అభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాలను ఏయే తేదీల్లో ఎక్కడ నిర్వహించాలనేది నిర్ణయించడానికి పార్టీ స్టీరింగ్‌ కమిటీ ఆదివారం సమావేశం కానుంది. దీంతోపాటు సంస్థాపరమైన ఇతర అంశాలనూ చర్చిస్తారు.

* విమర్శలనూ స్వీకరించడాన్ని ప్రధాని మోదీ అలవాటు చేసుకోవాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ సూచించారు. ప్రధానమంత్రిని అందరూ గౌరవిస్తామనీ, ఆయన కూడా తన పదవి హుందాతనాన్ని కాపాడుకోవాలని చెప్పారు. అత్యున్నత పదవిలో ఉన్నవారి జవాబుదారీతనాన్ని ఎందుకు నిర్ణయించకూడదని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు