గుజరాత్‌లో ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం

హోరాహోరీగా సాగిన గుజరాత్‌ శాసనసభ ఎన్నికల రెండో దశ ప్రచారపర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది.

Published : 04 Dec 2022 05:12 IST

రెండో దశలో 93 స్థానాలకు రేపు పోలింగ్‌

అహ్మదాబాద్‌: హోరాహోరీగా సాగిన గుజరాత్‌ శాసనసభ ఎన్నికల రెండో దశ ప్రచారపర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది. 182 సీట్ల అసెంబ్లీలో తొలి దశలో 89 స్థానాలకు ఈ నెల ఒకటిన పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మిగిలిన 93 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్‌ జరగనుంది. ఇందులో భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌ సహా పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి మొత్తం 833 మంది తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. గురువారం ఓట్లు లెక్కిస్తారు. అహ్మదాబాద్‌, వడోదరా, గాంధీనగర్‌ సహా మొత్తం 14 జిల్లాలు రెండో విడత పోరులో ఉన్నాయి. ఇందులో గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌కు చెందిన ఘాట్‌లోడియా, భాజపా టికెట్‌పై పోటీ చేస్తున్న పాటీదార్‌ నేత హార్థిక్‌ పటేల్‌కు చెందిన వీరామ్‌గామ్‌, మరో భాజపా ఓబీసీ నేత అల్పేశ్‌ ఠాగూర్‌కు చెందిన గాంధీనగర్‌ (దక్షిణం) నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రెండో దశలో మొత్తం 2.54 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గుజరాత్‌తో పాటు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఆరు అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికల ప్రచారం కూడా శనివారం ముగిసింది. వీటి పోలింగ్‌ కూడా సోమవారమే జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని