పొరుగు సేవల ఉద్యోగులపై వేటు వేస్తారా?: లోకేశ్‌

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానన్న హామీ నెరవేర్చకపోగా, రెండు లక్షలకు పైగా పొరుగుసేవల ఉద్యోగులపై వేటు వేస్తారా? అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు.

Updated : 05 Dec 2022 06:13 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానన్న హామీ నెరవేర్చకపోగా, రెండు లక్షలకు పైగా పొరుగుసేవల ఉద్యోగులపై వేటు వేస్తారా? అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ‘అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్‌ రద్దు చేస్తానన్న హామీని జగన్‌ గాలికొదిలారు. క్రమబద్ధీకరిస్తారని, సమాన పనికి సమాన వేతనం ఇస్తారని ఎదురుచూస్తున్న పొరుగుసేవల ఉద్యోగుల ఉపాధిపైనే వేటు వేస్తున్నారు’ అని లోకేశ్‌ ఆదివారం ట్విటర్‌లో ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని