జే-ట్యాక్స్‌తో పరిశ్రమలు వెనక్కి

ముఖ్యమంత్రి జగన్‌ జే-ట్యాక్స్‌తో రాష్ట్రంలోని పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

Published : 05 Dec 2022 03:41 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

టెక్కలి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ జే-ట్యాక్స్‌తో రాష్ట్రంలోని పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయిదు కోట్ల మందిని 50 మంది జే-గ్యాంగ్‌ నియంతల్లా పాలిస్తున్నారని విమర్శించారు. వారి ఆగడాలతో అన్నివర్గాల ప్రజలూ ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు ఏం చేశారని నిలదీశారు. 53 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రజల్ని విడదీసే కుట్రతప్ప వాటి ద్వారా ఎంత మందికి ఉపాధి కల్పించారని ప్రశ్నించారు. తెదేపా హయాంలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీలతో కూడిన రుణాలు అందించి వారిని ఆదుకున్నామన్నారు. ఇప్పుడేమో ఉపాధి అవకాశాల్లేక యువత అధోగతి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామక ప్రకటనల్లో జాప్యం జరిగిందని, అందుకు తగ్గట్టుగా అభ్యర్థులకు వయసు సడలింపు ఇవ్వాలని డిమాండు చేశారు. ఉత్తరాంధ్ర బీసీ మంత్రులు అవగాహన లేకుండా సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ఆత్మాభిమానాన్ని తమ పదవుల కోసం తాకట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని