తెలంగాణలో భయానక వాతావరణం సృష్టించే యత్నం

కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా తెలంగాణలో భయానక వాతావరణం సృష్టించేందుకు యత్నిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు.

Published : 05 Dec 2022 04:47 IST

కేంద్రంపై కూనంనేని విమర్శ

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా తెలంగాణలో భయానక వాతావరణం సృష్టించేందుకు యత్నిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి దిల్లీకి వచ్చిన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూలగొట్టింది. తెలంగాణలోనూ అదే విధానాన్ని అమలు చేస్తోంది. గవర్నర్‌ వ్యవస్థను భాజపా పూర్తిగా దుర్వినియోగం చేస్తోంది. తెలంగాణ గవర్నర్‌ను పార్టీ నాయకురాలిగా, రాజ్‌భవన్‌ను భాజపా భవన్‌గా మార్చారు. అందుకే ఆమె పార్టీ నేత తరహాలో ప్రకటనలు చేస్తున్నారు. గవర్నర్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతాం. ఈ నెల 7న హైదరాబాద్‌లో రాజ్‌భవన్‌ను ముట్టడిస్తాం’’ అని కూనంనేని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని