దిల్లీ మద్యం కేసుపై కేసీఆర్‌ పెదవి విప్పరేం?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దిల్లీ మద్యం కేసుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు పెదవి విప్పడం లేదని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు.

Published : 05 Dec 2022 04:47 IST

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దిల్లీ మద్యం కేసుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు పెదవి విప్పడం లేదని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఆదివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తమ శాసనసభ్యులను పులిబిడ్డలు అని ప్రకటించిన సీఎం, మద్యం కేసులో కుమార్తెను కాపాడటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. భాజపాకు చెందిన బీఎల్‌ సంతోష్‌ రూ.వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని