కేంద్ర ప్రభుత్వ గుట్టు రట్టయింది
బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్రం శరవేగంగా చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు.
శరవేగంగా బొగ్గు గనుల బ్లాకుల వేలం
సింగరేణి కార్మికులను రోడ్డున పడేస్తారా?
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
ఈనాడు, హైదరాబాద్: బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్రం శరవేగంగా చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని ఒకవైపు చెబుతూనే.. తెలంగాణలో గనులను ఈ సంస్థకు కేటాయించకుండా.. మరో టెండరు ప్రక్రియ చేపట్టడంపై ప్రధాని నరేంద్రమోదీ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేంద్రం గుట్టురట్టయిందని వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కోయగూడెం కోల్ బ్లాక్‌ను ప్రైవేట్ సంస్థకు కేంద్రం అప్పగించింది. భవిష్యత్తులో కూడా సింగరేణికి గనులు దక్కకుండా చేయడమే ఆ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. కోల్ బ్లాక్స్ చేతిలో లేకుంటే సింగరేణి సంస్థ ఏం పనిచేయాలి? సుమారు 60,000 మంది కార్మికులు, ఉద్యోగులను రోడ్డున పడేస్తారా?’’ అని నిలదీశారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 ప్రకారం సింగరేణి సంస్థకు ఓపెన్ టెండర్‌తో సంబంధం లేకుండా కోల్ బ్లాక్‌లను రిజర్వ్ చేసే అధికారం కేంద్రానికి ఉందని, ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘నవంబరు 3 నుంచి ప్రారంభమైన బొగ్గు గనుల బ్లాకుల వేలం పాటల పరంపర వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు కొనసాగనుంది. దీనిపై ముందుగానే హెచ్చరించినా భాజపా నాయకులు బుకాయించారు. ఇప్పటికైనా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కళ్లు తెరిచి మాట్లాడాలి’’ అని వినోద్‌కుమార్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sameera Reddy: మహేశ్‌బాబు సినిమా ఆడిషన్.. ఏడ్చుకుంటూ వచ్చేశా: సమీరారెడ్డి
-
India News
ఘోరం.. వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..!
-
Movies News
OTT Movies: డిజిటల్ తెరపై మెరవనున్న బాలీవుడ్ తారలు
-
Politics News
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ గృహ నిర్బంధం
-
Crime News
Hyderabad: రామంతపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
World News
Vladimir Putin: రష్యాను ఎదుర్కోవడం సులువు కాదు..: పుతిన్