ప్రశాంతంగా ముగిసిన దిల్లీ మున్సిపోల్స్‌

దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 250 వార్డులకు జరిగిన ఎన్నికల్లో సుమారు 50.47 శాతం ఓటింగ్‌ నమోదైంది.

Updated : 05 Dec 2022 06:14 IST

50.47 శాతం పోలింగ్‌ నమోదు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 250 వార్డులకు జరిగిన ఎన్నికల్లో సుమారు 50.47 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఓటింగ్‌ నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 493 ప్రాంతాల్లోని 3,360 సమస్యాత్మక బూత్‌ల వద్ద 25 వేలమంది పోలీసులు, 13 వేలమంది హోంగార్డులు, 100 కంపెనీల పారామిలటరీ దళాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈశాన్య దిల్లీ సహా అనేక ప్రాంతాల్లోని పలువురు తమ పేర్లు ఓటర్ల జాబితాలో కనిపించలేదని ఆరోపించారు. ఇదే అంశమై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు భాజపా ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో అనేకమంది పేర్లు గల్లంతయ్యాయని, ఇదంతా ఓ కుట్ర అని దిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా ఆరోపించారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మాజీమంత్రి హర్షవర్దన్‌, భాజపా ఎంపీ పర్వేష్‌ వర్మ, ఆప్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌, ఆల్కా లాంబ సహా పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ, భాజపా, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న ఈ ఎన్నికల్లో మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఫలితాలు ఈ నెల 7న వెలువడనున్నాయి.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని