మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలి

పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన గూండాలు మారణాయుధాలతో తన ఇంటిలో హింసాయుత వాతావరణం సృష్టించారని పారిశ్రామికవేత్త, బీసీ నేత రామచంద్రయాదవ్‌ ఆరోపించారు.

Updated : 06 Dec 2022 09:45 IST

హత్యాయత్నం కేసు నమోదుచేయాలి

పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన గూండాలు మారణాయుధాలతో తన ఇంటిలో హింసాయుత వాతావరణం సృష్టించారని పారిశ్రామికవేత్త, బీసీ నేత రామచంద్రయాదవ్‌ ఆరోపించారు. మంత్రిపై హత్యాయత్నం కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని, మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సదుంలో రైతుభేరి సభకు వెళ్లనీయకుండా సాయంత్రం 5 గంటలదాకా నన్ను గృహనిర్బంధం చేశారు. పోలీసులు మా అనుచరులను అరెస్టు చేసి, రోజంతా భయభ్రాంతులకు గురిచేశారు. రాత్రివేళ 250-300 మంది గూండాలు నన్ను, నా కుటుంబసభ్యులను చంపాలనే కుట్రతో మారణాయుధాలతో ఇంటికి వచ్చి దాడిచేశారు. గేట్లు, తలుపులు పగలగొట్టారు. కార్లు, బైకులను ధ్వంసం చేశారు. ముక్కలుగా నరికేస్తామని హెచ్చరించారు. నా సిబ్బంది తలలు పగలకొట్టారు. స్థానిక పోలీసులు, డీఎస్పీ, ఎస్పీ, డీఐజీ, ఐజీకి ఫోన్‌ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. వందల మంది అసాంఘిక శక్తులు ఉంటే.. విధ్వంసం పూర్తయ్యాక ఐదుగురు పోలీసులు జీపులో సైరన్‌ వేసుకుంటూ వెళ్లారే తప్పా నిలువరించలేదు. మా వర్గీయులు ఆదివారం రాత్రే పుంగనూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. సోమవారం రమ్మంటూ పంపించారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పడం సిగ్గుచేటు. మా ఫిర్యాదును తిరస్కరించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలి’ అని రామచంద్రయాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు