సీమ గర్జనకు వ్యతిరేకంగా తెదేపా నిరసన

రాయలసీమలో పరిశ్రమలు, ప్రాజెక్టులను నిర్మించడంలో ఘోరంగా విఫలమైన జగన్‌రెడ్డి రాయలసీమ ద్రోహి అని తెదేపా, అనుబంధ సంఘాల నాయకులు మండిపడ్డారు. 

Published : 06 Dec 2022 04:48 IST

కర్నూలు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాయలసీమలో పరిశ్రమలు, ప్రాజెక్టులను నిర్మించడంలో ఘోరంగా విఫలమైన జగన్‌రెడ్డి రాయలసీమ ద్రోహి అని తెదేపా, అనుబంధ సంఘాల నాయకులు మండిపడ్డారు. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సోమవారం వైకాపా చేపట్టిన సీమగర్జనను వ్యతిరేకిస్తూ తెదేపా జిల్లా కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ‘రాయలసీమ ద్రోహి జగన్‌’ అంటూ నినాదాలు చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని జగన్‌ పూర్తిగా విస్మరించారని.. ఏపీలో తనకు, తన పార్టీ సహచరులకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తున్నారన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారని వారు దుయ్యబట్టారు. రాయలసీమ గర్జన పేరుతో విద్యార్థులను బలవంతంగా సభకు తీసుకెళ్లడం సిగ్గుచేటని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ యాదవ్‌, బీసీ సెల్‌ కార్యదర్శి మహేశ్‌గౌడ్‌, అధికార ప్రతినిధులు రాజు యాదవ్‌, రాంబాబు, బజారన్న విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని