ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

నిర్మల్‌ మున్సిపాల్టీలో నాలుగో తరగతి ఉద్యోగుల భర్తీ విషయంలో తాను అవినీతికి పాల్పడినట్లు భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

Published : 06 Dec 2022 05:15 IST

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: నిర్మల్‌ మున్సిపాల్టీలో నాలుగో తరగతి ఉద్యోగుల భర్తీ విషయంలో తాను అవినీతికి పాల్పడినట్లు భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. బాసర ఆలయాన్ని ప్రసాద్‌ పథకంలో చేర్చాలని కోరినా కేంద్రం స్పందించలేదని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన ముఖ్యమంత్రిపై, ఆయన కుమార్తెపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. భాజపాకు వ్యతిరేకంగా ఉన్న నేతలపై ఈడీ, సీబీఐ అంటూ దాడులు చేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్‌- ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ విషయంలో ఎంపీ సోయం బాపురావు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని, పనులు ప్రారంభిస్తే నిధులు ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని