నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడిగా మరోసారి ఫరూక్‌ ఎన్నిక

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) పార్టీ అధ్యక్షుడిగా 85 ఏళ్ల ఫరూక్‌ అబ్దుల్లా మరోసారి ఎన్నికయ్యారు.

Published : 06 Dec 2022 05:15 IST

శ్రీనగర్‌: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) పార్టీ అధ్యక్షుడిగా 85 ఏళ్ల ఫరూక్‌ అబ్దుల్లా మరోసారి ఎన్నికయ్యారు. జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం నిర్వహించిన పార్టీ ప్రతినిధుల సదస్సులో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు గడువులోపు ఫరూక్‌ ఒక్కరే నామినేషన్‌ వేశారు. ఎన్‌సీకి దాదాపు మూడు దశాబ్దాల పాటు అధ్యక్షుడిగా ఉన్న ఫరూక్‌ అబ్దుల్లా 1981లో తొలిసారి పార్టీ పగ్గాలు చేపట్టారు. 2002 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన తనయుడు ఒమర్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2014లో ఆయన ఆ బాధ్యతల నుంచి వైదొలగడంతో తిరిగి ఫరూక్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇంతవరకు ఆయనే పార్టీ సారథ్య బాధ్యతలు చేపడుతూ వస్తున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని