రిజర్వేషన్ల పెంపునకు ఉద్యమం: ప్రవీణ్‌కుమార్
రిజర్వేషన్లలో బీసీలకు తగిన ప్రాధాన్యమివ్వాలని, వచ్చే శాసనసభ సమావేశాల్లో వెనకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్ పెంచాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
పాల్వంచ సాంస్కృతికం, న్యూస్‌టుడే: రిజర్వేషన్లలో బీసీలకు తగిన ప్రాధాన్యమివ్వాలని, వచ్చే శాసనసభ సమావేశాల్లో వెనకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్ పెంచాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎస్సీలకు 18, ఎస్టీలకు 10, మైనార్టీలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలంటూ ‘కోటి సంతకాల సేకరణ’ ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మహబూబ్‌నగర్ సభలో మూడు గంటలు ప్రసంగించిన సీఎం కేసీఆర్ దిల్లీ మద్యం కుంభకోణం విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదని విమర్శించారు. తన కుమార్తె కవితతోపాటు మరో ఎమ్మెల్సీని ఈ కుంభకోణం నుంచి కాపాడేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్‌ను ఇంతవరకు అరెస్టు చేయకపోవడంతో.. భాజపాతో తెరాస చీకటి ఒప్పందం కుదుర్చుకుందేమోనన్న అనుమానం కలుగుతోందని అన్నారు. అనంతరం పాల్వంచలో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Upasana: కియారాకు సారీ చెప్పిన ఉపాసన
-
World News
Earthquake: ఏ రాయి తొలగించినా ప్రాణం లేని దేహమే.. భూప్రళయంలో 8వేలకు చేరిన మరణాలు
-
Sports News
IND vs AUS: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ హీరోలు వీరే!
-
Movies News
Vijay Sethupathi: నేను కేవలం నటుడిని మాత్రమే... విజయ్ సేతుపతి అసహనం
-
World News
Diabetes: ‘డి’ విటమిన్‌తో మధుమేహం నుంచి రక్షణ!
-
Technology News
Whatsapp: వాట్సప్.. ఇక చిటికెలో ఫాంట్‌ను మార్చుకోవచ్చు!