భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు.. హేరామ్‌, జై సియారామ్‌ అనాలి

సీతారాములను కలిపి గుర్తించే ‘హే రామ్‌’, ‘జై సియారామ్‌’ (సీతారామ్‌) నినాదాలను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు విస్మరిస్తున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సోమవారం విమర్శించారు.

Updated : 06 Dec 2022 05:47 IST

 జోడో యాత్రలో రాహుల్‌ వ్యాఖ్య

ఝాలావాఢ్‌: సీతారాములను కలిపి గుర్తించే ‘హే రామ్‌’, ‘జై సియారామ్‌’ (సీతారామ్‌) నినాదాలను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు విస్మరిస్తున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సోమవారం విమర్శించారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో ఝాలావాఢ్‌ జిల్లాలోని నహర్దీలో ఆయన మాట్లాడారు. ‘‘భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలారా.. మీరు మీ జీవితాలను రాముడి ఆదర్శాల ప్రకారం జీవించాలి. మీరు ‘హే రామ్‌’ ‘జై సియారామ్‌’ అనాలి’’ అని వ్యాఖ్యానించారు. 

* కొందరి నుంచి ఎడిటర్లు, యజమానులపై వస్తున్న ఒత్తిడి కారణంగా జాతీయస్థాయిలోని ప్రధాన మీడియా భారత్‌ జోడో యాత్రను బహిష్కరిస్తోందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా తన పాత్రను పోషించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ విషయంలో మీడియాను చరిత్ర క్షమించదు’’ అని వ్యాఖ్యానించారు.


పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట

ముంబయి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. స్థానిక కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు ఇచ్చిన మినహాయింపును వచ్చే నెల 25వరకూ పొడిగించింది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. ఈ కేసులో స్థానిక కోర్టు తనకు జారీ చేసిన సమన్లను సవాల్‌ చేస్తూ రాహుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందం విషయంలో మోదీని ‘కమాండర్‌-ఇన్‌-థీఫ్‌’గా రాహుల్‌ అభివర్ణించారు. దీనిపై మహేశ్‌ అనే భాజపా కార్యకర్త పరువు నష్టం కేసు వేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని