సీమ ప్రాజెక్టుల సాధనకు పోరుబాట

రాయలసీమకు కీలకమైన తాగు, సాగునీటి ప్రాజెక్టులపై వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ రైతులు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు.

Updated : 07 Dec 2022 06:24 IST

తెదేపా నేతలు కాలవ, పయ్యావుల

కణేకల్లు, న్యూస్‌టుడే: రాయలసీమకు కీలకమైన తాగు, సాగునీటి ప్రాజెక్టులపై వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ రైతులు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. అనంతపురం జిల్లా కణేకల్లు చెరువు నుంచి దిగువకు హెచ్చెల్సీ నీటిని తరలించే అవుట్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ దుస్థితిని మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీమ ప్రాజెక్టుల సాధనకు ఈ నెలలో తెదేపా ఆధ్వర్యంలో పోరుబాట పాదయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ‘హెచ్చెల్సీ దుస్థితిపై 2005లో తెదేపా ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తే, ఆధునికీకరణకు నిధులు ఇచ్చినా, గిట్టుబాటు కాదని గుత్తేదారులు పనులు చేయలేదు. మళ్లీ తెదేపా ప్రభుత్వం వచ్చాక 50 శాతానికిపైగా పనులు పూర్తిచేశాం. వైకాపా ప్రభుత్వం మూడున్నరేళ్లలో తట్టెడు మట్టీ తీయలేదు. మరో రూ.400 కోట్లు అవసరమని అంచనాలు వేసినా, రూపాయి కూడా ఇవ్వలేదు. కణేకల్లు అవుట్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ షట్టర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి’ అని పేర్కొన్నారు. తెదేపా హయాంలో షట్టర్ల వద్ద ప్రత్యామ్నాయ నిర్మాణానికి నిధులు ఇచ్చినప్పటికీ, పనులు చేపట్టిన గుత్తేదారు, వైకాపా నేత అర్ధాంతరంగా ఆపేశారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని