24 గంటలు సమయం ఇస్తున్నా..!

నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి తనపై వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే 24 గంటల్లో బయటపెట్టాలని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సవాల్‌ చేశారు.

Published : 07 Dec 2022 04:58 IST

ఆధారాలుంటే బయటపెట్టండి..!!
వైకాపా నేతలకు లోకేశ్‌ సవాల్‌

ఈనాడు, అమరావతి: నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి తనపై వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే 24 గంటల్లో బయటపెట్టాలని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సవాల్‌ చేశారు. ఆరోపణలు చేసి పారిపోవడం వారికి అలవాటేనన్నారు. వైకాపా నేతల మాదిరిగా అందరూ అవినీతిపరులేనని ప్రజల్ని మభ్యపెట్టేందుకే తనపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘వైకాపా నాపై చేస్తున్న ఆరోపణలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు నేను సిద్ధం. 24 గంటల సమయం ఇస్తున్నా. నైపుణ్యాభివృద్ధి వ్యవహారం సహా, నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే వైకాపా బయట పెట్టాలి. అవి బయటపెడతారో... ప్యాలస్‌ పిల్లితో పాటు, మిగతా వైకాపా పిల్లులు పారిపోతాయో వేచి చూద్దాం...’’ అని లోకేశ్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘‘జగన్‌రెడ్డికి పరిపాలన చేతగాక, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న వేళ మరోసారి వారి దృష్టిని మరల్చేందుకు నాపై కొత్త ఆరోపణలు మొదలు పెట్టారు. మీరు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల ఎనిమిది నెలలైంది. మీరు చెయ్యని విచారణ లేదు. నాతో పాటు తెదేపా అధినేత చంద్రబాబుపై చేసిన ఆరోపణల్లోను వాస్తవం లేదని తేలిపోయింది. మేం మీలానే అవినీతికి పాల్పడి చిప్పకూడు తింటామనుకోవడం మీ అవివేకం...’’ అని ఆయన ధ్వజమెత్తారు. ‘‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, ఫైబర్‌గ్రిడ్‌, ఐటీ కంపెనీలకు రాయితీలు.. ఇలా పలు అంశాల్లో నాపై అవినీతి బురదజల్లారు. ఒక్క ఆరోపణలకూ ఆధారాలు చూపలేకపోయారు. ఆఖరికి చంద్రబాబుపై మీరు ఎంతో అల్లరి చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా కోర్టు కొట్టేసింది...’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు