డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కి చిరునామాగా ఏపీని మార్చిన జగన్‌

స్వర్ణాంధ్రగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కి చిరునామాగా మార్చారని తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

Published : 07 Dec 2022 04:58 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు

ఈనాడు-అమరావతి: స్వర్ణాంధ్రగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కి చిరునామాగా మార్చారని తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఏపీలో 18,267 కిలోల డ్రగ్స్‌ దొరికాయన్న ‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా’ నివేదికపై జగన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘దేశం నలుమూలలకు గంజాయి, ఇతర ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. ఉత్తరాంధ్రను గంజాయి డెన్‌గా మార్చిన ఘనుడు విజయసాయిరెడ్డి. ఈయన సారథ్యంలో జేగ్యాంగ్‌, వైకాపా నేతలే గంజాయి సాగు చేస్తూ...ఆన్‌లైన్‌ ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. విశాఖ నుంచి వెళ్లిన నాలుగున్నర కిలోల డ్రగ్స్‌ పార్శిల్‌ ఇటీవలే బెంగుళూరులో పట్టుబడింది. గుజరాత్‌ ముంద్రా పోర్టులో పట్టుబడిన డ్రగ్స్‌ మూలాలు ఏపీతో లింకయి ఉన్నాయని తేలింది. ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, పంజాబ్‌, బెంగుళూరు, చెన్నైలో.. ఎక్కడ డ్రగ్స్‌, ఇతర మాదక ద్రవ్యాలు పట్టుబడినా రాష్ట్రం పేరే వినిపిస్తోంది. డబ్బు పిచ్చితో యువత జీవితాలు నాశనం చేస్తూ రాష్ట్రాన్ని వైకాపా నేతలు డ్రగ్స్‌ అడ్డాగా మార్చారు...’ అని బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సంకల్పసిద్ధి కుంభకోణం, రియల్‌ ఎస్టేట్‌, సెటిల్‌మెంట్ల దందాతో ఏపీలో వైకాపా నేతలు పోగేసి ఇతర రాష్ట్రాల్లో పెట్టిన పెట్టుబడులు ఐటీ, ఈడీ దాడులతో బయటపడుతున్నాయి. దేవినేని కొడుకు, వల్లభనేని వంశీనే కాదు.. ఇంకా చాలా పెద్ద బ్యాచ్‌ ఉంది. ఆలీబాబా దొంగల ముఠాలోని వారు దొరికితే ...వారి వెనక ఉన్న పెద్ద తలకాయలు బయటకొస్తాయి...’ అని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని