అంబేడ్కర్‌ ఆకాంక్షలను వర్తమాన సమాజం అర్థం చేసుకోవాలి: పవన్‌

‘‘రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలను, ఆకాంక్షలను వర్తమాన సమాజం అర్థం చేసుకోవాలి. ఆయన భారతీయ సమాజాన్ని కూలంకషంగా అధ్యయనం చేసినందున సామాజికంగా అట్టడుగున ఉన్న వారిని చట్టసభల వైపు నడిపించాలని కోరుకున్నారు.

Published : 07 Dec 2022 05:30 IST

ఈనాడు, అమరావతి: ‘‘రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలను, ఆకాంక్షలను వర్తమాన సమాజం అర్థం చేసుకోవాలి. ఆయన భారతీయ సమాజాన్ని కూలంకషంగా అధ్యయనం చేసినందున సామాజికంగా అట్టడుగున ఉన్న వారిని చట్టసభల వైపు నడిపించాలని కోరుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వారిని భాగస్వాములను చేయాలని సంకల్పించారు’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం నివాళులర్పించారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు చేరాలని ఆయన తపించారన్నారు.

ఎస్సీలు బతకలేని పరిస్థితులు...

హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా నేతలు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలు బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఉపప్రణాళిక నిధులు ఇవ్వడం లేదన్నారు. కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి శంకర్‌గౌడ్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు అర్హంఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు