గవర్నర్‌ వ్యవస్థ రద్దు చేయాలి: కూనంనేని

ఎలాంటి ప్రయోజనం లేని గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

Published : 07 Dec 2022 05:30 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఎలాంటి ప్రయోజనం లేని గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గవర్నర్‌ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19న దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ఈ పదవిని అడ్డుపెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్నవారు రాష్ట్రాల్లో అనిశ్చితిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు పంపే ఫైళ్లను నెలల తరబడి పరిశీలించకుండా గవర్నర్లు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు. చాడ మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన సీపీఐ జాతీయ సమావేశాల్లో భూపోరాటాలు, ప్రజాసమస్యలపైనా ఆందోళనలను తీవ్రం చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని